Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మాటలు జాగ్రత్తగా రానీ కేటీఆర్.. నేను రెచ్చిపోతే మీ ప్రభుత్వం పడిపోతుంది!: వి.హనుమంతరావు వార్నింగ్

  • వీహెచ్ ను బఫూన్ అన్న టీఆర్ఎస్ నేత కేటీఆర్
  • తాను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కేటీఆర్ పుట్టనేలేదని వ్యాఖ్య
  • హైదరాబాద్ లో మీడియాతో కాంగ్రెస్ సీనియర్ నేత
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనను బఫూన్ అని పిలవడంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు తీవ్రంగా స్పందించారు. ‘నేను రాజకీయాల్లోకి వచ్చేటప్పటికి కేటీఆర్ ఇంకా పుట్టనేలేదు. అలాంటి ఆయన నన్ను బఫూన్ అంటున్నడు. మాటలు జాగ్రత్తగా రానీ కేటీఆర్. నేను రెచ్చిపోతే మీ ప్రభుత్వం పడిపోతుంది’ అని హెచ్చరించారు.

హైదరాబాద్ లో ఈరోజు మీడియాతో వీహెచ్ మాట్లాడారు. కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేసేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పార్టీలు ఫిరాయించే నేతలపై ప్రజలు తిరగబడాలనీ, వారి ఇళ్లపై దాడులు చేయాలని వీహెచ్ పిలుపునిచ్చారు. కేటీఆర్‌ తన బావమరిది స్నేహితుడికి టెండర్‌ అప్పగించారన్నారు. బావమరిది మీద మోజుతో 22 మంది విద్యార్థులను కేటీఆర్ బలిగొన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Telangana
Congress
VH
KTR
TRS
bafoon
warning

More Telugu News